మానూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం ఉందని కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఇప్పటివరకు అడ్మిషన్ పొందని విద్యార్థులు సమయం వృథా చేయకుండా వెంటనే కళాశాలలో చేరాలని సూచించారు. కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న మెరుగైన విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. మండల పరిధిలో సుమారు 40 మంది విద్యార్థులు ఇప్పటివరకు ఎక్కడా ఇంటర్‌లో ప్రవేశం పొందలేదని యూడైస్ వివరాల్లో నమోదైందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంటర్ విద్యను కొనసాగించేలా ప్రోత్సహించాలని ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న కోరారు.
PRINT TIME: September 01, 2026 04:23 PM
మనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు చివరి అవకాశం

01-09-2026
19 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
మానూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం ఉందని కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఇప్పటివరకు అడ్మిషన్ పొందని విద్యార్థులు సమయం వృథా చేయకుండా వెంటనే కళాశాలలో చేరాలని సూచించారు. కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న మెరుగైన విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. మండల పరిధిలో సుమారు 40 మంది విద్యార్థులు ఇప్పటివరకు ఎక్కడా ఇంటర్‌లో ప్రవేశం పొందలేదని యూడైస్ వివరాల్లో నమోదైందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంటర్ విద్యను కొనసాగించేలా ప్రోత్సహించాలని ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి