Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:51 PM

విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

31-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని హాస్టల్ సంక్షేమ అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం, తాగునీరు, పరిశుభ్రత, వసతి, ఆరోగ్య సదుపాయాలు సక్రమంగా అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని, హాస్టళ్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అందిస్తున్న పథకాలు, సౌకర్యాలు ప్రతి అర్హుడైన విద్యార్థికి పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగేలా హాస్టళ్లలో అనుకూలమైన వాతావరణం కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థుల చదువు, ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని హాస్టల్ సంక్షేమ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని హాస్టల్ సంక్షేమ అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం, తాగునీరు, పరిశుభ్రత, వసతి, ఆరోగ్య సదుపాయాలు సక్రమంగా అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని, హాస్టళ్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అందిస్తున్న పథకాలు, సౌకర్యాలు ప్రతి అర్హుడైన విద్యార్థికి పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగేలా హాస్టళ్లలో అనుకూలమైన వాతావరణం కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థుల చదువు, ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని హాస్టల్ సంక్షేమ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News