వెయ్యి రోజుల ప్రజా పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎంపీ చామల...
మాజీ సీఎం కేసీఆర్‌పై నల్లగొండ ఎంపీ తీవ్ర విమర్శలు...
దళిత నేతకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్...
నల్గొండ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను, వెయ్యి రోజుల ‘ప్రజా పాలన’ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన వారం రోజుల కార్యక్రమాలకు ధీటుగా సమాధానం చెప్పేలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని సూచించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయికి వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని తీవ్ర అప్పులపాలు చేశారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దళితుడిని అసెంబ్లీ పక్ష నేతగా చేయాలి...
గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పిన కేసీఆర్, ఇప్పుడు కూడా ఆ వర్గానికి అన్యాయమే చేస్తున్నారని చామల విమర్శించారు. వెయ్యి రోజులుగా కేసీఆర్ అసెంబ్లీ చర్చల్లో పాల్గొనకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ శాసనసభా పక్ష (బీఆర్ఎస్ఎల్‌పీ) నేత పదవి నుంచి కేసీఆర్ వెంటనే తప్పుకుని, ఆ అవకాశాన్ని తమ పార్టీలోని ఏదేని దళిత ఎమ్మెల్యేకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత నేతకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చినప్పుడే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక అర్హత బీఆర్ఎస్‌కు ఉంటుందని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి