Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:51 PM

ఇల్లు ఇచ్చారు.. విద్య, వైద్యం మరిచారు!

ఇల్లు ఇచ్చారు.. విద్య, వైద్యం మరిచారు!

ఇల్లు ఇచ్చారు.. విద్య, వైద్యం మరిచారు!
31-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

థర్టీన్నారం 2బీహెచ్‌కే కాలనీలో 1,268 ఫ్లాట్లు.. 500 మంది పిల్లలకు సమీపంలో పాఠశాల కరువు.

అత్యవసర వైద్య సేవలపైనా ఆందోళన.. మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వానికి ప్రజల ప్రశ్నలు.

హైదరాబాద్‌: పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 2బీహెచ్‌కే పథకం ద్వారా ఇళ్లు కేటాయించడం అభినందనీయమే. అయితే ఇల్లు కల్పించిన తర్వాత అక్కడ నివసించే కుటుంబాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై మాత్రం ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నాగోల్‌ సర్కిల్‌, పెదంబర్పేట, వార్డు నం.52లో ఉన్న థర్టీన్నారం 2బీహెచ్‌కే కాలనీలో 1,268 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ కాలనీలో సుమారు 500 మంది పిల్లలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే పిల్లల విద్య కోసం సమీపంలో తగిన పాఠశాల సౌకర్యం లేకపోవడంతో పేద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చదువు కోసం దూరభారం..

కాలనీకి సమీపంలో పాఠశాల అందుబాటులో లేకపోతే చిన్నారులను ప్రతిరోజూ దూర ప్రాంతాలకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు అంటున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రయాణ ఖర్చులు, ఇతర విద్యా వ్యయాలు అదనపు భారంగా మారుతున్నాయని పేర్కొంటున్నారు.

అత్యవసర వేళ వైద్యం ఎలా?

ఇక అత్యవసర వైద్య పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే చికిత్స అందించే స్థాయిలో వైద్య సదుపాయం లేకపోవడంపైనా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ జనాభాకు అనుగుణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా అందుబాటులో ఉండే వైద్య సేవలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతలో ఒక భాగమేనని, ఆ ఇంటిలో ప్రజలు గౌరవంగా జీవించేందుకు విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి కనీస మౌలిక వసతులు కూడా కల్పించాల్సిన అవసరం ఉందని వరకాంతం నవీన్‌ రెడ్డి పేర్కొన్నారు.

1,268 కుటుంబాలకు ఇళ్లు కేటాయించిన ప్రభుత్వం.. వారి పిల్లల విద్య, కుటుంబాల వైద్య అవసరాల కోసం పూర్తి స్థాయి సదుపాయాలను ఎప్పుడు కల్పిస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇది రాజకీయ విమర్శ కాదని, పేద ప్రజల జీవన హక్కులకు సంబంధించిన ప్రజా ప్రశ్న అని పేర్కొన్నారు.2బీహెచ్‌కే కాలనీలో విద్య, వైద్య సదుపాయాలను తక్షణమే ఏర్పాటు చేసి, ప్రజలకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Sthanikam

ఇల్లు ఇచ్చారు.. విద్య, వైద్యం మరిచారు!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News