మోటకొండూరు: ఆరెగూడెం గ్రామంలో సీపీఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కామ్రేడ్ గాదెగాని మల్లయ్య 21వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామ్రేడ్ నల్ల ప్రదీప్‌రెడ్డి అధ్యక్షత వహించారు. మల్లయ్య స్తూపానికి సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, పేరబోయిన మహేందర్, మండల కార్యదర్శి గాదగాని మాణిక్యం, మండల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బోలగాని సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉమ్మడి మోటకొండూరు గ్రామపంచాయతీలో రెడ్డిగట్టి శేషయ్య నాయకత్వంలో రేగు సిద్ధయ్య, గాదెగాని మల్లయ్య, కొల్లూరు ఇస్తారి తదితరులతో కలిసి సర్వే నంబర్ 950లో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంచడంలో మల్లయ్య కీలకంగా పనిచేశారని అన్నారు. గ్రామీణ ప్రజలకు అండగా నిలిచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించారని తెలిపారు.
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ మాట్లాడుతూ.. ఉమ్మడి యాదగిరిగుట్ట మండలంలో మండల కౌన్సిల్‌గా పనిచేసిన మల్లయ్య, మోటకొండూరు గ్రామంలో నిరుపేదలు, భూమిలేని ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని అన్నారు. భూమిలేని వారికి సాగు భూమి కోసం జరిగిన భూ పోరాటాల్లో ముందుండి పనిచేశారని తెలిపారు. ఆరెగూడెం గ్రామంలో పెత్తందారుల ఆధీనంలో ఉన్న గుడి, బడి స్థలాలను ప్రజా పోరాటం ద్వారా కాపాడిన నాయకుడు మల్లయ్య అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం ఉద్యమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఆలేటి బాలరాజు, మండల కార్యవర్గ సభ్యులు బోల శ్రీనివాసు, పశువుల నరసింహ, మారబోయిన నరేష్, గాదగాని మల్లేష్, మారబోయిన హేమలేష్, మారబోయిన జహంగీర్, రేగు యాదయ్య, కొండ భీమయ్య, బీసా పాండు, పేరబోయిన రమేష్, మారబోయిన జాంగీర్, గాదెగాని నరసింహులు, నల్ల యుద్ధవరెడ్డి, జివిలికపల్లి పాండు, గాదెగాని కరుణాకర్, బీరకాయల మధు, బీసా నరసయ్య, గాదెగాని కార్తీక్, గాదగాని రాజు, కొల్లూరు స్వామి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి