Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ దాడులు అరాచకం ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 04:23 PM

ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల సొంతింటి కల సాకారం

01-09-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి అన్నారు. చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో మూడో వార్డు సభ్యుడు మేడబోయిన విజయ నాగరాజుకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణారెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు సొంత ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో తొలి విడతలో దివంగత రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి చొరవతో 3,500 ఇళ్లు మంజూరు కాగా, సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. రెండో విడతలో మరో 2,000 ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్‌ వంటి పథకాలను అమలు చేసిందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో వారిని బస్సుల యజమానులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గుడిసె రామకృష్ణ, ఉపసర్పంచ్‌ పల్లెటి వీరమ్మ వెంకన్న, మాజీ ఉపసర్పంచ్‌ మేడబోయిన పుల్లయ్య, వార్డు సభ్యులు దాసరి లింగయ్య, పల్లెటి జనార్దన్‌, గ్రామ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి పల్లెటి వీరబ్రహ్మం, గ్రామశాఖ అధ్యక్షుడు మామిడి యల్లయ్య, కోశాధికారి చింతల మురళి, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుండు రామ్మూర్తి, కాంగ్రెస్‌ నాయకులు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ షేక్‌ అబ్దుల్‌ కరీం, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల సొంతింటి కల సాకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News