Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివలాల్ మహారాజ్ దీక్షలకు ఆహ్వానం.. అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 01:39 PM

టీటీడీ భూమి సర్వే పూర్తయినా.. నిర్ణయంలో జాప్యం ఎందుకు?

01-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల 649 సర్వే నంబర్‌పై అధికారుల నిశ్శబ్దం.. తప్పిదమా? తాత్సారమా?

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్‌ 649లో ఉన్న టీటీడీ భూమికి సంబంధించి సర్వే పూర్తయినట్లు సమాచారం. భూమి హద్దులు, విస్తీర్ణం తదితర అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేసినప్పటికీ, తదుపరి నిర్ణయం విషయంలో మాత్రం జాప్యం ఎందుకు జరుగుతోందన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

టీటీడీ కల్యాణ మండపం కోసం కేటాయించినట్లు చెబుతున్న ఈ భూమిపై గత కొంతకాలంగా వివిధ అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో సర్వే పూర్తయిన అనంతరం భూమి వాస్తవ పరిస్థితిపై అధికారికంగా స్పష్టత ఇవ్వడంతో పాటు, తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సర్వే పూర్తయినప్పటికీ సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే దానిపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది అధికారుల తప్పిదమా? లేక నిర్ణయం తీసుకోవడంలో తాత్సారమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టీటీడీకి సంబంధించిన భూమి కావడంతో వ్యవహారాన్ని పారదర్శకంగా పరిష్కరించి, సర్వే నివేదికను బహిర్గతం చేసి, భూమి పరిరక్షణకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు జాప్యానికి కారణాలను వెల్లడించి, తదుపరి కార్యాచరణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

టీటీడీ భూమి సర్వే పూర్తయినా.. నిర్ణయంలో జాప్యం ఎందుకు?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News