నాగల్‌గిద్ద మండలంలోని ఔదత్‌పూర్ గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు వైఎస్సార్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమానికి, పేదల ఆరోగ్యానికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసిన మహానేతగా వైఎస్సార్ ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు. ఆయన ఆశయాలను, ప్రజా సంక్షేమ పాలనను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు, సర్పంచ్ అంబాజీ, సంతోష్, బి. శంకర్, వై. పండరి, అబ్దుల్ రహీం, యూసుబ్ సాబ్, వై. ఆర్జన్, బి. ధర్మ, నవాబ్ మియా, రామప్పతో పాటు గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల గుండెల్లో చిరస్థాయి వైఎస్సార్.. ఔదత్‌పూర్‌లో ఘనంగా వర్ధంతి వేడుకలు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి