Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 10:01 AM

కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు.......

02-09-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం పై కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రావెళ్ల కృష్ణారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పద్మావతి రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలకు ఒక హద్దు ఉంటుందని, వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలకు పాల్పడటం రాజకీయ సంస్కారం కాదని మండిపడ్డారు. ప్రజల్లో గౌరవం ఉన్న నాయకులపై నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని హితవు పలికారు.

“కాంగ్రెస్‌ పార్టీ కోసం రూ.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలకు ముందుగా సమాధానం చెప్పాలి. పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు ఏం సమాధానం చెబుతారు?” అని రావెళ్ల కృష్ణారావు ప్రశ్నించారు.ఆరోపణలకు సమాధానం చెప్పకుండా రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు కాకుండా వాస్తవాలను ప్రజల ముందుంచాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయవద్దని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే ముందుగా తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పి, అనంతరం కాంగ్రెస్‌ నాయకులపై మాట్లాడాలని రావెళ్ల కృష్ణారావు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలను సహించేది లేదని, పార్టీ శ్రేణులు ఐక్యంగా ఎదుర్కొంటాయని ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు.......

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News