నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం రసోల్ గ్రామంలో 20 రోజుల పసికందు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం సోమవారం బాబుకు జ్వరం రావడంతో తడ్కల్ గ్రామంలోని ఆర్‌ఎంపీ రాములు వద్ద చికిత్స చేయించారు. అయినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో మంగళవారం ఉదయం బాబు పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు కంగ్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాబు మృతి చెందినట్లు తెలిపారు.పసికందు మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆర్‌ఎంపీ వద్ద చికిత్స అనంతరం బాబు ఆరోగ్యం మరింత క్షీణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ, వైద్యం విషయంలో నిర్లక్ష్యం జరిగిందా అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టాలని కోరారు. అయితే పసికందు మృతికి ఖచ్చితమైన కారణం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. వైద్యుల పరిశీలన, అధికారుల విచారణ అనంతరం మృతికి అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది.
జ్వరంతో 20 రోజుల పసికందు మృతి.. కుటుంబంలో కన్నీరుమున్నీరు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి