Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలకు కరపత్రికల ఆవిష్కరణ. ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:02 PM

హైదరాబాద్‌లో ఉత్తరాఖండ్‌ జర్నలిస్టుల పర్యటన.

01-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేంద్ర పథకాలపై క్షేత్రస్థాయి పరిశీలన.

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 స్థానికం ప్రతినిధి :

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఉత్తరాఖండ్‌కు చెందిన 15 మంది పాత్రికేయుల బృందం హైదరాబాద్‌లో పర్యటిస్తోంది. డెహ్రాడూన్‌ పీఐబీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ సుంద్రియాల్‌ నేతృత్వంలోని బృందం ఆగస్టు 31న నగరానికి చేరుకుంది. సెప్టెంబరు 4 వరకు పర్యటన కొనసాగనుంది.పర్యటనలో భాగంగా తొలిరోజు హైదరాబాద్‌లోని పీఐబీ కార్యాలయంలో ఏజీడీ శృతి పాటిల్‌, జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మానస్‌ కృష్ణకాంత్‌తో బృందం సమావేశమైంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పీఐబీ, సీబీసీ నిర్వహిస్తున్న సమాచార కార్యక్రమాలను అధికారులు వివరించారు. తెలంగాణ పర్యటన అనుభవాలను ఉత్తరాఖండ్‌ ప్రజలకు తెలియజేయాలని శృతి పాటిల్‌ సూచించారు.

అనంతరం కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ పరిధిలోని ఇన్‌కాయిస్‌ను బృందం సందర్శించింది. సముద్ర పరిస్థితుల పర్యవేక్షణ, సునామీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై అధికారులు వివరించారు. పర్యటనలో భాగంగా ఎన్‌ఐఎన్‌, ఈఎస్‌ఐసీ ఆసుపత్రి, తెలంగాణ చేనేత–చేతివృత్తుల ప్రదర్శనలను కూడా బృందం సందర్శించనుంది.హైదరాబాద్‌ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకునేందుకు సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, లాడ్‌బజార్‌ తదితర ప్రాంతాలను కూడా పాత్రికేయులు సందర్శించనున్నారు.

Sthanikam

హైదరాబాద్‌లో ఉత్తరాఖండ్‌ జర్నలిస్టుల పర్యటన.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News