Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:55 AM

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు. హైడ్రా కమిషనర్ రంగనాథ్.. సీపీ సుమతి

01-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.

గణేష్‌ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మల్కాజిగిరి సీపీ సుమతి అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఉత్సవాలు నిర్వహించాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సూచించారు.నాగోల్‌లోని పీఎంఆర్‌ కన్వెన్షన్‌లో సోమవారం రాత్రి సీపీ సుమతి ఆధ్వర్యంలో శాఖల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, వైద్య శిబిరాలు, అగ్నిమాపక సిబ్బంది, అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

గణేష్‌ మండపాల నిర్వాహకులు ముందుగానే తమ వివరాలను పోలీసులకు అందించాలని అధికారులు కోరారు. మండపాల వద్ద విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా నాణ్యమైన వైర్లు, పరికరాలు వినియోగించాలని, విద్యుత్‌, అగ్నిమాపక నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

నిమజ్జన ప్రాంతాలు, ప్రధాన రహదారులు, మండపాల వద్ద పారిశుద్ధ్య చర్యలు నిరంతరం కొనసాగించాలని నిర్ణయించారు. చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవడంతోపాటు ఉత్సవాల అనంతరం వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. నీటి సరఫరా, డ్రైనేజీ, రహదారుల నిర్వహణలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.సమావేశంలో ఎంఎంసీ అదనపు కమిషనర్‌ రఘు ప్రసాద్‌, జోనల్‌ కమిషనర్లు రాధిక గుప్తా, సంచిత్‌ గంగ్వార్‌, వికాస్‌ మహతో, డీసీపీలు అనురాధ, సురేష్‌, ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు. హైడ్రా కమిషనర్ రంగనాథ్.. సీపీ సుమతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News