Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:22 PM

బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?.

బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?.

బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?.
01-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్‌పై మండిపడ్డ కమలం నేతలు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండించిన చిట్యాల బీజేపీ నాయకత్వం.

చిట్యాల: నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డా. వర్శిత్‌రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి, ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు ఆయన తల్లితో సహా కుటుంబ సభ్యులపై భౌతిక దాడికి పాల్పడ్డారని చిట్యాల బీజేపీ మండల అధ్యక్షుడు పీక వెంకన్న ముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌గౌడ్ ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు.

దాడికి గురైన కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం నల్గొండకు వెళ్తున్న తమను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, బాధిత కుటుంబానికి అండగా నిలవడానికి వెళ్తున్న బీజేపీ నాయకులను అడ్డుకోవడం దారుణమన్నారు.

దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయనడానికి ఈ ఘటన నిదర్శనమని బీజేపీ నాయకులు విమర్శించారు. ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులపై భౌతిక దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులను తక్షణమే అరెస్ట్ చేసి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని చిట్యాల బీజేపీ మండల, పట్టణ శాఖలు డిమాండ్ చేశాయి.

ముందస్తు అరెస్టుల్లో పలువురు బీజేపీ నేతలు.

ముందస్తు అరెస్టైన వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు పీకే వెంకన్న ముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌గౌడ్, సీనియర్ నాయకులు అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కూరెళ్ల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి మండల నరసింహ, జిల్లా కార్యవర్గ సభ్యుడు విష్ణు, సీనియర్ నాయకుడు కంచర్ల శంకర్‌రెడ్డి, పట్టణ నాయకులు వైరాల రాహుల్, పిల్లి రవి తదితరులు ఉన్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు.

Sthanikam

బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News