కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రావెళ్ల కృష్ణారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పద్మావతి రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలకు ఒక హద్దు ఉంటుందని, వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలకు పాల్పడటం రాజకీయ సంస్కారం కాదని మండిపడ్డారు. ప్రజల్లో గౌరవం ఉన్న నాయకులపై నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని హితవు పలికారు.
“కాంగ్రెస్ పార్టీ కోసం రూ.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలకు ముందుగా సమాధానం చెప్పాలి. పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు ఏం సమాధానం చెబుతారు?” అని రావెళ్ల కృష్ణారావు ప్రశ్నించారు. భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని, అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను మోసం చేసి సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని అందుబాటులో లేకుండా పోయారనే ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ముందు గతాన్ని బయటపెట్టండి.. తర్వాత విమర్శలు చేయండి
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని, అయితే ఒక నాయకుడి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని కృష్ణారావు అన్నారు.మాజీ ఎమ్మెల్యే ముందుగా తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పి, అనంతరం కాంగ్రెస్ నాయకులపై మాట్లాడాలని రావెళ్ల కృష్ణారావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలను సహించేది లేదని, పార్టీ శ్రేణులు ఐక్యంగా ఎదుర్కొంటాయని ఆయన స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి