Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేత రావెళ్ల కృష్ణారావు ధ్వజం ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 08:24 AM

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.....

02-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం,తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఎన్జీవో కోదాడ అధ్యక్షులు గడ్డం చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా గడ్డం చిరంజీవి మాట్లాడుతూ సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంగా మారిందని, తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్‌సీ నివేదికను అమల్లోకి తేవాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకట నగేష్, ట్రెజరర్ మహేష్, నాయకులు పులి శ్రీను, పవన్, ముస్తఫా, విక్రమ్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.....

Sthanikam

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News