తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఈ సదస్సులో భాగంగా డిఫెన్స్ ఎక్స్‌పో–2026ను ఏర్పాటు చేస్తున్నామని, దానిని కేంద్ర మంత్రి ప్రారంభించాలని సీఎం కోరారు. ఢిల్లీలో పలువురు ఎంపీలతో కలిసి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డిఫెన్స్ ఎక్స్‌పోలో ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష రంగాలపై ప్రత్యేక సదస్సులతో పాటు ప్రతిష్టాత్మక ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, అత్యాధునిక రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌షోకు అవసరమైన అనుమతులు మంజూరు చేయడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు పాల్గొనేలా సహకరించాలని కోరారు. అలాగే సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలు, డీఆర్‌డీవో, హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీడీఎల్ తదితర సంస్థల స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విదేశీ రక్షణ ప్రతినిధులు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రతినిధులతో సమావేశాలకు కూడా కేంద్రం సహకరించాలని కోరారు. మరోవైపు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూమిని సేకరించిందని, రక్షణ శాఖ కోరిన మేరకు మరో 750 ఎకరాలు సేకరించి మొత్తం 1,500 ఎకరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్‌డీఎల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర శక్తి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేష్ కుమార్ షేట్కార్, పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో–2026.. రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి