Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ సారాంపల్లి మల్లారెడ్డి కి ఘననివాళులు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 06:52 PM

డీఏలు.. పీఆర్సీ.. ఓపీఎస్‌ కోసం పోరాటం.

డీఏలు.. పీఆర్సీ.. ఓపీఎస్‌ కోసం పోరాటం.

డీఏలు.. పీఆర్సీ.. ఓపీఎస్‌ కోసం పోరాటం.
02-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్‌ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కంచి రవికుమార్ డిమాండ్‌ చేశారు. రామన్నపేట మండలంలోని వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయడంతో పాటు పీఆర్సీని అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. హెల్త్‌కార్డులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, జీవో నంబర్‌ 25ను సవరించాలని, 317 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు మోహన్‌రెడ్డి, కట్ట కృష్ణ, జిల్లా సోషల్‌ మీడియా కన్వీనర్‌ అనిల్‌కుమార్, మండల ప్రధాన కార్యదర్శి మంకాల కుమారస్వామి, ఉపాధ్యక్షుడు ఘాసిరాం, కోశాధికారి కర్నె త్రివేణి ప్రసాద్, ఎఫ్‌డబ్ల్యూఎస్‌ మండల కన్వీనర్‌ మధుబాబు, సీనియర్‌ నాయకుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

Sthanikam

డీఏలు.. పీఆర్సీ.. ఓపీఎస్‌ కోసం పోరాటం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News