రామన్నపేట
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని రామన్నపేట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం నివాళులర్పించారు. జిల్లా పరిషత్ విశ్రాంతి భవనంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి వైఎస్సార్ చేసిన సేవలుచిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటే రమేష్, కాంగ్రెస్ నాయకులు వనం చంద్రశేఖర్, కొమ్ము శేఖర్, మోటే మహేష్, నకరికంటి సుదర్శన్, మహమ్మద్ రిజ్వాన్, మీర్జా ఈనాయతుల్లా బేగ్, మహమ్మద్ కరీం, గొలుసుల ప్రసాద్, మేడి శంకరయ్య, మహమ్మద్ మున్నన్, భైరబోయిన శీను తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి