Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. హామీల అమలులో ఘోర వైఫల్యం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 08:29 PM

ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో నష్టాలు.. అప్పులు తీర్చేందుకు పగటి పూట ఇళ్లలో చోరీలు

02-09-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో భారీగా డబ్బులు నష్టపోయి అప్పుల పాలైన ఓ యువకుడు, వాటిని తీర్చేందుకు పగటిపూట తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతూ నార్కట్‌పల్లి పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి సుమారు రూ.22.10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ.2.50 లక్షల నగదు, ద్విచక్ర వాహనం, ఐరన్ కట్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి కేసు వివరాలను వెల్లడిస్తూ నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెం గ్రామానికి చెందిన గేగు పద్మ కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు 24న బంధువుల ఇంట్లో జరిగిన ఎంగేజ్‌మెంట్ వేడుకకు వెళ్లారు. మరుసటి రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని బీరువాను పరిశీలించగా రెండు బంగారు ఉంగరాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి ఎస్‌ఐ విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెం గ్రామానికి చెందిన అలుగుబెల్లి రాము అలియాస్ జయరాంరెడ్డి (29)పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మార్కెటింగ్ ఉద్యోగం చేస్తూ ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో భారీగా డబ్బులు కోల్పోయిన రాము, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, ఇతర శుభకార్యాలకు కుటుంబాలు వెళ్లిన సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి పగటిపూట చోరీలకు పాల్పడేవాడని తెలిపారు. ఐరన్ కట్టర్‌తో తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి బంగారం, వెండి, నగదును అపహరించేవాడని వెల్లడించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సెప్టెంబరు 2న ఉదయం నార్కట్‌పల్లి–అమ్మనబోల్ ఎక్స్‌రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తున్న రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఐరన్ కట్టర్, బంగారం, వెండి ఆభరణాలు, నగదు లభించడంతో విచారించగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 9 చోరీ కేసులకు పాల్పడినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తులో 12 తులాల బంగారు ఆభరణాలు (విలువ రూ.19.20 లక్షలు), 16 తులాల వెండి వస్తువులు (విలువ రూ.40 వేలు), రూ.2.50 లక్షల నగదు, ద్విచక్ర వాహనం ఐరన్ కట్టర్ ఉన్నాయి. కేసును చాకచక్యంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన నార్కట్‌పల్లి సీఐ సురేష్, ఎస్‌ఐ విష్ణుమూర్తి, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఎస్పీ కె. శివరాం రెడ్డి అభినందించారు.

Sthanikam

ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో నష్టాలు.. అప్పులు తీర్చేందుకు పగటి పూట ఇళ్లలో చోరీలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News