మంత్రి కోమటిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నాగిళ్ళ మురళి.
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ (టీఎన్జీవో) జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న నాగిళ్ల మురళికి పదోన్నతి లభించింది.
కో-ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఇన్స్పెక్టర్ నుంచి అసిస్టెంట్ రిజిస్టర్ గా పదోన్నతి పొందారు
ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు , సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాదులో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ సేవకులుగా పనిచేస్తూ వారి మన్ననలు పొందాలని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు
ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు
ప్రభుత్వ ఉద్యోగులకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో టిఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేపూరి నరసింహ చారి, టీఎన్జీవో మాజీ పూర్వ జిల్లా అధ్యక్షుడు ఏడుదొడ్ల వెంకట్రామిరెడ్డి, జిల్లా కార్యదర్శి జే.శేఖర్ రెడ్డి, మనోజ్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి