Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా సతీష్‌కుమార్‌ నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 09:05 AM

సంగెం గ్రామ MRPS అధ్యక్షుడిగా చేడుపాక సునీల్

03-09-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Thungathurthi
Mahendar Kalakotla

సంగెం: తుంగతుర్తి మండలం సంగెం గ్రామ MRPS అధ్యక్షుడిగా చేడుపాక సునీల్, ఉపాధ్యక్షుడిగా పానుగంటి సైదులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులను MRPS నాయకులు, కార్యకర్తలు అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో MRPSను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పాటుపడుతూ, ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హక్కులపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రామంలోని ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.

తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన MRPS నాయకులకు, కార్యకర్తలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో సంఘం కార్యకలాపాలను చురుగ్గా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో MRPS నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

సంగెం గ్రామ MRPS అధ్యక్షుడిగా చేడుపాక సునీల్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News