Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా సతీష్‌కుమార్‌ నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 09:09 AM

బీజేపీ కార్పొరేటర్లపై దాడికి కుట్ర?

బీజేపీ కార్పొరేటర్లపై దాడికి కుట్ర?

బీజేపీ కార్పొరేటర్లపై దాడికి కుట్ర?
03-09-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కక్ష సాధింపు చర్యలంటూ కార్పొరేటర్ దాసరి సాయికుమార్ ఆరోపణ.

ఇళ్ల వరకు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు.. పోలీసులకు ఫిర్యాదు.

నల్లగొండ: నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో బీజేపీ కార్పొరేటర్లపై దాడులకు కుట్ర జరుగుతోందని కార్పొరేటర్‌ దాసరి సాయికుమార్‌ ఆరోపించారు. రాజకీయ అసహనంతో కొందరు కాంగ్రెస్‌ నాయకులు గత రెండు రోజులుగా బీజేపీ కార్పొరేటర్ల ఇళ్ల వద్దకు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదన్నారు.

బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సాయికుమార్‌ మాట్లాడుతూ.. బీజేపీ ఎదుగుదలను, కార్పొరేటర్లు ప్రజలతో మమేకమై పనిచేయడాన్ని జీర్ణించుకోలేక కొందరు కాంగ్రెస్‌ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 48వ డివిజన్‌లో అభివృద్ధి నిధుల దుర్వినియోగంపై ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ప్రశ్నించినందుకే తన ఇంటిపై దాడికి యత్నించారని ఆరోపించారు. ప్రజల ఆస్తులను కాపాడాలని, అభివృద్ధి నిధులను దుబారా చేయవద్దని ప్రశ్నించినందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు’

ఎన్ని దాడులు చేసినా ప్రజల పక్షాన నిలబడతామని సాయికుమార్‌ స్పష్టం చేశారు. తనపై దాడికి యత్నించిన వారిపై నల్లగొండ రెండో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్‌ నాయకులు చేసిన దాడికి నిరసనగా తాము ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేపట్టామని తెలిపారు. అయితే వ్యక్తిగత కక్షతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి తల్లి ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. మహిళ అని కూడా చూడకుండా ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులను కోరారు.

సమావేశంలో అక్కేపల్లి బలరాం, దుర్గ, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీజేపీ కార్పొరేటర్లపై దాడికి కుట్ర?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News