Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా సతీష్‌కుమార్‌ నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 09:08 AM

చెరువులకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయాలి.....

03-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో చెరువులు, కుంటలను నింపేందుకు నీటిని విడుదల చేసినప్పటికీ, కోదాడ మండల పరిధిలోని కొత్తగూడెం మేజర్ చివరి ఆయకట్టు రైతులకు నీరందక తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోల్లు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోదాడ నీటిపారుదల శాఖ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)కి రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బోల్లు ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం నీటిని విడుదల చేసినా కోదాడ మండలంలోని కొత్తగూడెం మేజర్ పరిధిలో ఉన్న తమ్మర,బండపాలెం తో పాటు పలు గ్రామాలకు నీరు సరిపడా రావడం లేదన్నారు. దీనివల్ల నేటి వరకు కూడా ఆయా గ్రామాల పరిధిలోని చెరువులు నిండని పరిస్థితి నెలకొందని తెలిపారు. సాగునీరు అందక రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలువల ద్వారా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి, చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు సజ్జ సుబ్బారావు, సామినేని రమేష్, సామినేని సతీష్, బొల్లు నరేష్, బత్తినేని రమేష్, మందులపు రమేష్, కనగాల పూర్ణచంద్రరావు, కమతం సైదయ్య తదితరులు పాల్గొన్నారు...........

Sthanikam

చెరువులకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయాలి.....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News