కోదాడ పట్టణంలో గంజాయి విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని కోరుతూ బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ సీఐ శివశంకర్‌కు వినతిపత్రం అందజేశారు. పట్టణంలో గంజాయి వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతోందని, అక్రమ విక్రయదారులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపాలని కోరారు.ఈ సందర్భంగా సీఐ శివశంకర్ మాట్లాడుతూ కోదాడను పూర్తి గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే గంజాయి రవాణాదారులను, విక్రేతలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గంజాయి నిర్మూలనకు ప్రజలు, నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంటి పులి వెంకటేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ షేక్ బషీర్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు........
గంజాయి రహిత కోదాడ గా తీర్చిదిద్దుతాం
గంజాయి రహిత కోదాడ గా తీర్చిదిద్దుతాం
Harish reporter

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి