తుంగతుర్తి;రాష్ట్రంలో నిలిచిపోయిన రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మరియు ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ బుధవారం తుంగతుర్తి తహశీల్దార్ దయానందం కు వినతిపత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ, బకాయిలు చెల్లించకపోవడంతో దాదాపు 30 వేల మందితో పాటు, ఉన్నత విద్యనభ్యసిస్తున్న 90 శాతం మంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇది రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు. ఫీజుల పేరుతో కాలేజీలు సర్టిఫికెట్లు ఆపకుండా విద్యార్థులకు అందజేసేలా ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ మహారాజ్, శ్రీను మహారాజ్, సతీష్ యాదవ్, సుంకరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి