అక్రమ ఆస్తుల ఆరోపణలపై సోదాలు.. మానసనగర్‌లోని నివాసంలో ఏసీబీ తనిఖీలు.
సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య ఏసీబీ వలలో చిక్కారు. భారీగా అవినీతికి పాల్పడి అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం సోదాలు చేపట్టారు. సూర్యాపేటలోని మానసనగర్‌లో ఉన్న సోమయ్య నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
టౌన్ ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సోమయ్యపై అవినీతి, అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఇంట్లోని పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, ఇతర రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
సోదాలు పూర్తయిన తర్వాత సోమయ్యకు సంబంధించిన ఆస్తులు, నగదు, ఇతర వివరాలపై ఏసీబీ అధికారులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అయితే సోదాల్లో ఇప్పటివరకు ఏమేమి గుర్తించారనే వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి