చౌటుప్పల్ లో అడ్డుకున్న బజరంగ్‌దళ్ కార్యకర్తలు
చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం గ్రామం వద్ద కబేళాలకు అక్రమంగా తరలిస్తున్న 26 పశువులను పోలీసులు, బజరంగ్‌దళ్ కార్యకర్తలు గురువారం రక్షించారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌లోని బహదూర్‌పుర ప్రాంతానికి భారీగా పశువులను తరలిస్తున్నట్లు బజరంగ్‌దళ్ కార్యకర్తలకు సమాచారం అందింది. వారు వెంటనే అప్రమత్తమై ధర్మోజీగూడెం క్రాస్ రోడ్ వద్ద వాహనాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.చౌటుప్పల్ హెడ్ కానిస్టేబుల్ నరేష్ (HC-2314), హోంగార్డు HG-92 (PM-2) పోలీసు బృందం వెంటనే అక్కడికి చేరుకుని వాహనాల తనిఖీలు చేపట్టారు. సందేహాస్పదంగా వచ్చిన ఐచర్ డీసీఎం (TS 08UG 8181)ను ఆపి తనిఖీ చేయగా, అందులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 26 పశువులను (16 ఆవులు, 10 ఎద్దులు) గుర్తించారు.
వాహనాన్ని నడుపుతున్న ఈసీఐఎల్ దమైగూడకు చెందిన డ్రైవర్ ఎస్‌కే ఇస్మాయిల్ (34)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం అన్నాయపేటకు చెందిన యజమాని అసంతా వెంకన్న బాబు (55) సూచనల మేరకే వీటిని జగ్గయ్యపేట సంతలో కొనుగోలు చేసి బహదూర్‌పురకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి