Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కృష్ణుడి వేషాల్లో చిన్నారుల సందడి నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 05:24 PM

మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
03-09-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Thungathurthi
Mahendar Kalakotla

సూర్యాపేట: జిల్లా ఎస్పీ కె. నరసింహ, IPS ఆదేశాల మేరకు మహిళలు, కాలేజీ విద్యార్థినుల భద్రతపై అవగాహన కల్పించేందుకు షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థినులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షీ టీమ్స్ ఎస్‌ఐ జి. నీలిమ మాట్లాడుతూ కాలేజీలు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో మహిళలు, యువతుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

కాలేజీలు, షాపింగ్ మాల్స్ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసుల నిఘా, భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని తెలిపారు. మహిళల భద్రతకు షీ టీమ్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ఎస్‌ఐ జి. నీలిమ పేర్కొన్నారు.

మహిళలు, విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు.

Sthanikam

మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News