ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కళాశాలలోని సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, క్రమం తప్పకుండా హాజరవుతూ శ్రద్ధగా చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. గత 32 ఏళ్లుగా ఎంతోమంది విద్యార్థులు ఈ కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విభాగాల ఇన్‌చార్జీలు తమ విభాగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్. రత్నమంజుల, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ డి. కిషన్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. లక్ష్మీనీలిమ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
PRINT TIME: September 03, 2026 05:51 PM
ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అవగాహన.
ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అవగాహన.
03-09-2026
8 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కళాశాలలోని సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, క్రమం తప్పకుండా హాజరవుతూ శ్రద్ధగా చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. గత 32 ఏళ్లుగా ఎంతోమంది విద్యార్థులు ఈ కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విభాగాల ఇన్‌చార్జీలు తమ విభాగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్. రత్నమంజుల, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ డి. కిషన్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. లక్ష్మీనీలిమ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి