తుంగతుర్తి;
కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్ల పాలనలో పూర్తిగా రైతు వ్యతిరేక నిర్ణయాలతో వ్యవసాయందివాలా తీయించ్చిందని మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని రామన్నగూడెం తండాలో ఎస్ఆర్సిపి కాలువలో నిరసన తెలిపి మాట్లాడారూ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంకఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. రైతు భరోసా. రైతు భీమా. 24గం విద్యుత్ పంటకు సరిపోయే యూరియా ఏది సకాలంలో ఇవ్వకుండా కనీసం గోదావరి జలాలను కూడ అందించలేని ఈ కాంగ్రెస్ పార్టీ కి ప్రభుత్వానికి తగిన గుణ పాఠం చెప్పాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో గాజుల యాదగిరి గాజుల భుజంగారావు. ఉపసర్పంచ్ వేణు. బూక్య ధర్మ నాయక్ గుగులోతు రాములు. అంగోతు వీరు. వీర నాయక్ బాణు నాయక్.మాజీ సర్పంచ్ యాకు నాయక్ తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి