Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ సోదాల వేళ.. అధికారుల గైర్హాజరు! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 01:01 PM

ఏసీబీ సోదాల వేళ.. అధికారుల గైర్హాజరు!

ఏసీబీ సోదాల వేళ.. అధికారుల గైర్హాజరు!

ఏసీబీ సోదాల వేళ.. అధికారుల గైర్హాజరు!
03-09-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మున్సిపల్‌ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న వేళ పలువురు అధికారులు, సిబ్బంది కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గురువారం ఉదయం 10.30 గంటలు దాటినా కొందరు అధికారులు విధులకు హాజరుకాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్న సమయంలో సంబంధిత అధికారులు కార్యాలయంలో లేకపోవడానికి కారణమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు హాజరు రిజిస్టర్‌లో సంతకాలు ఉన్నప్పటికీ కొందరు సిబ్బంది కార్యాలయంలో కనిపించకపోవడం కూడా చర్చకు దారితీసింది.

విధి నిర్వహణలో భాగంగా నిర్ణీత సమయానికి అధికారులు, సిబ్బంది కార్యాలయంలో అందుబాటులో ఉండాల్సి ఉండగా.. ఏసీబీ తనిఖీలు జరుగుతున్న కీలక సమయంలోనే గైర్హాజరు కావడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. హాజరు రిజిస్టర్‌తో పాటు బయోమెట్రిక్‌ వివరాలను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి స్పష్టమవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

ఏసీబీ సోదాల వేళ.. అధికారుల గైర్హాజరు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News