Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ సోదాల వేళ.. అధికారుల గైర్హాజరు! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 01:01 PM

అమూల్య శ్రీ కేసులో ఊహించని పరిణామం

అమూల్య శ్రీ కేసులో ఊహించని పరిణామం

అమూల్య శ్రీ కేసులో ఊహించని పరిణామం
03-09-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బెయిల్‌పై విడుదలైన ప్రధాన నిందితుడి ఆత్మహత్య

షార్ట్‌ఫిల్మ్‌ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టయి, చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మహేష్‌ (19) బెయిల్‌పై విడుదలైన కొద్దిరోజులకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైదాబాద్‌ సింగరేణి కాలనీలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

మహేష్‌ను అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో సైదాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. ఇంటికి వచ్చిన కొద్దిరోజులకే ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది.

తమ కుమారుడిపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని, పోలీసుల వేధింపుల కారణంగానే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మహేష్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఆరోపణలను పోలీసులు దర్యాప్తులో పరిశీలిస్తున్నారు. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత మహేష్‌ ఎవరితోనైనా మాట్లాడాడా? ఎవరైనా బెదిరించారా? కేసు విచారణపై ఒత్తిడికి గురయ్యాడా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. అతడి ఫోన్‌, కాల్‌ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Sthanikam

అమూల్య శ్రీ కేసులో ఊహించని పరిణామం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News