రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలతో శోభనాద్రిపురం ఎం.పి.యు.పి.ఎస్ పాఠశాల సందడిగా మారింది. కృష్ణుడి వేషధారణలో బాలురు, గోపికలుగా బాలికలు మురిపించగా.. తల్లిదండ్రులు, గ్రామస్థులు దాండియా నృత్యంతో సందడి చేశారు.స్థానిక ఎం.పి.యు.పి.ఎస్ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారుల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు, మహిళలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోపికలతో కలిసి దాండియా నృత్యం చేస్తూ చిన్నారులతో ఆనందంగా గడిపారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్ననాటి నుంచే సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశ సంస్కృతి ఎంతో సంపన్నమైనదని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయురాలు పెరుమాండ్ల కళావతి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
కృష్ణుడి వేషధారణలో చిన్నారుల సందడి. గోపికలతో కలిసి తల్లిదండ్రుల దాండియా.

Editor Desk

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి