Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కృష్ణుడి వేషాల్లో చిన్నారుల సందడి నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 05:21 PM

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో రైతులకు తీరని అన్యాయం’

03-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సాగునీరు, కరెంట్, యూరియా విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేశారు.

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

నార్కట్పల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో రైతులకు తీరని అన్యాయం చేసిందని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నార్కట్పల్లి పట్టణంలోని శబరి గార్డెన్స్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. సుమారు 2 వేల మంది పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు విఫలమయ్యాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నాగార్జునసాగర్‌లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు సరిపడా సాగునీరు అందించకపోవడంతో పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.

కరెంట్‌ కోతలతో మోటార్లు కాలిపోయే పరిస్థితి.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించడం లేదని, తరచూ విద్యుత్‌ కోతలు, లో-వోల్టేజీ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. లో-వోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

యూరియా కోసం రైతుల అవస్థలు.

రైతులకు నేరుగా యూరియా అందించకుండా ఆన్‌లైన్‌ లింకులు, ఇతర నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రైతులకు అందాల్సిన యూరియాను బ్లాక్‌మార్కెట్‌కు తరలించే పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. అలాగే రైతు బీమా పాలసీలను సకాలంలో రెన్యువల్‌ చేయకుండా రైతులను ప్రభుత్వం మోసం చేసిందని చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు.

రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, సాగునీరు, నాణ్యమైన విద్యుత్‌, ఎరువులు, రైతు బీమా వంటి అంశాలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Sthanikam

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో రైతులకు తీరని అన్యాయం’

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News