Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సౌమ్య విద్యామందిర్‌లో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు. నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 06:37 PM

సౌమ్య విద్యామందిర్‌లో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు.

03-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిన చిన్నారుల సందడి.. కృష్ణుడు, గోపికల వేషధారణ ప్రత్యేక ఆకర్షణ.

చిట్యాల: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడం విద్యలో భాగమని సౌమ్య విద్యామందిర్ పాఠశాల డైరెక్టర్ బొడిగె రవీందర్ అన్నారు. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలోని సౌమ్య విద్యామందిర్ పాఠశాలలో ప్రిన్సిపల్ బొడిగె విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో గురువారం ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి చిత్రపటానికి, ఉట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని కేరింతలు కొడుతూ సందడి చేశారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు అలరించారు. వారి వేషధారణ, ఉట్టి కొట్టే కార్యక్రమం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా డైరెక్టర్ రవీందర్ మాట్లాడుతూ పుస్తక విద్యతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. పండుగల నిర్వహణ ద్వారా చిన్నారులకు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని పరిచయం చేయవచ్చని తెలిపారు. శ్రీకృష్ణుడి జన్మవృత్తాంతం, కృష్ణాష్టమి విశిష్టతను విద్యార్థులకు వివరించారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు రుద్రారపు లావణ్య, మునుకుంట్ల వేణు, మునుకుంట్ల స్వాతి, బొడిగె రాణి, గండమల్ల చర్విత, రేగులగడ్డ ప్రశాంతి, సూరోజు హర్షిణితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

సౌమ్య విద్యామందిర్‌లో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News