యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్.
చిట్యాల: షెడ్యూల్డ్ కులాల ఆరాధ్య దైవంగా భావించే సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ చిత్రపటాన్ని అవమానించారంటూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎస్సీ మోర్చా, సమగ్ర మోచి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆగస్టు 31న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై, సంత్ రవిదాస్ చిత్రపటాలపై నల్ల సిరా చల్లిన ఘటనకు సంబంధించి గురువారం చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఎస్సైకి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం చిట్యాల కనకదుర్గ సెంటర్‌లో సంత్ శిరోమణి గురు రవిదాస్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిదాస్ మహారాజ్‌ను అవమానించడం సహించేది లేదని నాయకులు పేర్కొన్నారు.కార్యక్రమంలో సంత్ రవిదాస్ రాష్ట్ర కన్వీనర్ మాస శ్రీనివాస్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా. రుద్రవరం లింగస్వామి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీను, జిల్లా సీనియర్ నాయకులు చిక్కలమెట్ల అశోక్, కౌన్సిలర్ కూరెళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు జయరపు రామకృష్ణ, సీనియర్ నాయకులు కంచర్ల శంకర్‌రెడ్డి, సమగ్ర మోచి చిట్యాల సంఘం సభ్యులు చంద్రగిరి రవికుమార్, మాస నరేష్, దంతుల నవీన్‌కుమార్, చంద్రగిరి శివమదన్, చంద్రగిరి శివ, చంద్రగిరి సాయితో పాటు పలువురు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి