Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 08:47 PM

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌.. ఐదు చోరీలు!

03-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ముగ్గురు సభ్యుల దొంగల ముఠా అరెస్ట్‌.. భారీగా సొత్తు స్వాధీనం.

నల్గొండ: జల్సాల కోసం తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను నల్గొండ వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు గత రెండు నెలల్లో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఐదు చోరీలకు పాల్పడినట్లు విచారణలో అంగీకరించారు.

వారి నుంచి 30 తులాల వెండి ఆభరణాలు, 4 గ్యాస్‌ సిలిండర్లు, 3 బ్యాటరీలు, 4 సెల్‌ఫోన్లు, రూ.14,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురికీ గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఆదేశాలతో వన్‌టౌన్‌ సీఐ రాజశేఖర్‌ రెడ్డి, ఎస్‌ఐలు సైదులు, వెంకట్‌ నారాయణ, సిబ్బంది నిందితులను పట్టుకున్నారు. వారిని జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ అభినందించారు.

Sthanikam

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌.. ఐదు చోరీలు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News