రామన్నపేట: పట్టణంలో ముత్యాలమ్మ, కోట మైసమ్మ, బొడ్రాయి సర్కార్‌కు బోనం సమర్పించే కార్యక్రమం గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉపసర్పంచ్ మోటీ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు బోనాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మోటీ రమేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు నకిరేకంటి మొగులయ్య, శిరీష పృధ్వీరాజ్, ఆకవరపు మధుబాబు, మాజీ ఎంపీటీసీలు సాల్వేరు అశోక్, వనం చంద్రశేఖర్, ఊట్కూరి నరసింహ, జెల్లా వెంకటేష్, ఎండీ జమీర్ తదితరులు పాల్గొన్నారు.
వార్డు సభ్యులు, అన్ని కుల సంఘాల పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, స్థానికులు హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి