Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 10:13 PM

గణేష్‌ ఉత్సవాలకు గ్రీన్‌ సిగ్నల్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.

03-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి: గణేష్‌ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసులు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి.సుమతి, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో గురువారం గణేష్‌ ఉత్సవ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ కే.సైదులు మాట్లాడుతూ.. గణేష్‌ విగ్రహాల ప్రతిష్ఠాపన, ఆగమనం, ఊరేగింపు, నిమజ్జనానికి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు తగిన చర్యలు చేపట్టాలన్నారు.

డీజేలు, సౌండ్‌ సిస్టమ్‌లపై ఆంక్షలు.

ప్రభుత్వ నిబంధనల మేరకు శబ్ద పరిమితులను పాటించాలని స్పష్టం చేశారు. పరిమితికి మించి డీజేలు వినియోగించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్దేశించిన తేదీల్లోనే నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు.

ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిర్వాహకులను కోరారు. భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించేందుకు పోలీస్‌ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపారు. సమావేశంలో ఉత్సవ నిర్వాహకులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

గణేష్‌ ఉత్సవాలకు గ్రీన్‌ సిగ్నల్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News