Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీఎం సభను విజయవంతం చేయాలి నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 11:08 AM

నారాయణ హైస్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు

నారాయణ హైస్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు

నారాయణ హైస్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు
04-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్థానిక నారాయణ ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈ-ఛాంప్స్ ఆర్ అండ్ డి హెడ్ సంగీత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ద్వాపరయుగంలో ప్రజలను పీడించిన కంసుడిని సంహరించి ధర్మసంస్థాపన చేసేందుకు భాద్రపద మాసం, కృష్ణ పక్ష అష్టమి, రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడని వివరించారు. చెరసాలలో జన్మించిన బాలకృష్ణుడిని వసుదేవుడు యమునా నది దాటించి గోకులంలోని యశోదా-నందుల వద్దకు చేర్చిన వైనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. "ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది, అధర్మం ఎప్పటికీ నిలవదు" అనే గొప్ప సందేశాన్ని కృష్ణుని జీవితం మనకు అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నవనీత, వైస్ ప్రిన్సిపల్స్ క్రాంతి, మాధవి, అకడమిక్ డీన్ వెంకన్న, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాతరాజు వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణ హైస్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News