లక్కారంలో 'మద్రాస్ ఫిల్టర్ కాఫీ' ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే
యువత వ్యాపార రంగంలో రాణిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం 8వ వార్డు జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన 'మద్రాస్ ఫిల్టర్ కాఫీ' సెంటర్‌ను మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులకు, స్థానికులకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వినయ్, నాయకులు, స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి