తుంగతుర్తి;
సెప్టెంబర్ 6 7 8 తేదీలలో కరీంనగర్లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలు విజయవంతం చేయాల నీ గుగులోత్ రాజారామ్ ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు . ఏఐటియుసి తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ లో సెప్టెంబర్ 6న జరుగు కార్మిక ప్రదర్శనము జయప్రదం చేయాలని ఆయన కార్మికుల లోకానికి పిలుపునిచ్చారు.7,8 తేదీలలో ప్రతి నిధుల మహాసభ జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన స్పష్టమైన వైఖరితో అజెండాతో ముందుకు వెళుతున్న ఏకైక కార్మిక సంఘం ఏఐటియుసి అని అలాంటి సంఘం మహాసభలను జయప్రదం చేయడం ద్వారా ఈ దేశంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న పాలకుల యొక్క పనితీరును మహాసభలో చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమంలో దిశా నిర్దేశం చేసే విధంగా ఈ మహాసభలు జరుగుతున్నాయని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరుతో నల్ల చట్టాలను ముందుకు తీసుకువస్తుందని ఆ చట్టాలను రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదనే విధంగా తీర్మానాలు చేపడతామని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానానికి స్కీమ్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనియెడల మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బొంకూరు శ్యాంసుందర్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు కోట రామస్వామి, నరసయ్య , నజీర్ , వెంకన్న ,ఆంధ్రయ, హైమద్ ,ఖదీర్, శ్రీనివాస్, సత్యం ,బిక్షపతి, యాకు బ్ ,సైదులు ,మహేష్, నరేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి