నిదానపల్లిలో ఘనంగా SIR అవగాహన సదస్సు.
నిదానపల్లి, సెప్టెంబర్ 5: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR-2026)పై నిదానపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మండల తహశీల్దార్ లాల్ బహుదూర్, ఆర్‌ఐ శోభ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా SIR ప్రక్రియ ప్రాధాన్యతను గ్రామస్తులకు వివరించారు. సెప్టెంబర్ 5 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక డ్రైవ్‌ను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఫారమ్-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ఓటరు కార్డులో తప్పులు లేదా చిరునామా మార్పులు ఉన్నవారు ఫారమ్-8 ద్వారా సవరణలు చేసుకోవాలని తెలిపారు.
సెప్టెంబర్ 5, 6 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద BLOలు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమన్, జీపీఓ లక్ష్మి, బి ఎల్‌ఓ బబ్బూరి నాగమణి, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి