Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీఎం సభ వేళ.. మాజీ ఎమ్మెల్యే హౌస్‌ అరెస్ట్‌ నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 01:25 PM

తిరుమలగిరిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగుల నిరసన.

05-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి: దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దివ్యాంగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ హాజరై ప్రసంగించారు.

దివ్యాంగులకు రూ.6వేల పింఛన్, బ్యాక్‌లాగ్ పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల సంక్షేమానికి రూ.10,300 కోట్లు అందించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు.

వృద్ధులు, మహిళలకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉద్యమాలు, పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు,నేవూరి ధర్మేందర్ రెడ్డి, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి,పార్టీ నాయకులు కల్లేట్లపల్లి ఉప్పలయ్య,కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,యాకోబ్ రెడ్డి,తాటికొండ సీతయ్య, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు,త్రిశూల్,రమేష్,నరేష్,యాకూబ్,శోభన్ బాబు సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తిరుమలగిరిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగుల నిరసన.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News