Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల ఐక్యతకు మరో ముందడుగు.. నూతన యూనియన్ ఐడీ కార్డుల పంపిణీ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 09:25 PM

పంతంగిలో కన్నులపండువగా ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

05-09-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వైభవంగా అమ్మవారి శోభాయాత్ర, ప్రత్యేక పూజలు

పెద్దఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు

చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక కోలాహలం నడుమ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించనున్న అమ్మవారి విగ్రహాన్ని డప్పు దరువులు, ఆటపాటలు, మహిళల మంగళహారతుల నడుమ గ్రామ ప్రధాన వీధుల గుండా అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఊరేగింపు పొడవునా భక్తులు, యువకులు "జై ముత్యాలమ్మ తల్లి" అంటూ చేసిన భక్తి నినాదాలతో పంతంగి గ్రామం మారుమోగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా యజ్ఞయాగాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన, కుంకుమ పూజలు, హోమాది ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కులు తీర్చుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం భక్తులకు, గ్రామ ప్రజలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బృహత్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

పంతంగిలో కన్నులపండువగా ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News