సౌమ్య విద్యామందిర్ ప్రిన్సిపల్ బొడిగె విజయకుమార్.
చిన్నకాపర్తి: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని సౌమ్య విద్యామందిర్ పాఠశాల ప్రిన్సిపల్ బొడిగె విజయకుమార్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం చిన్నకాపర్తిలోని సౌమ్య విద్యామందిర్ పాఠశాలలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, విలువలు, క్రమశిక్షణ, నైతికత, సామాజిక బాధ్యత వంటి అంశాలను అలవర్చడంలో ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, సరైన మార్గనిర్దేశం చేస్తే వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా తీర్చిదిద్దవచ్చన్నారు. విద్యారంగానికి, ఉపాధ్యాయ వృత్తికి సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రుద్రారపు లావణ్య, మునుకుంట్ల వేణు, మునుకుంట్ల స్వాతి, గండమల్ల చర్విత, రేగులగడ్డ ప్రశాంతి, సురోజు హర్షిణి, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి