Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 06:56 AM

100 పడకల ఆస్పత్రికి అమరజీవి నర్రా రాఘవరెడ్డి పేరు పెట్టాలి

06-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ప్రభుత్వానికి సీపీఎం నేతల వినతి.

నకిరేకల్: నకిరేకల్ పట్టణంలో నూతనంగా నిర్మించి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించిన 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి అమరజీవి నర్రా రాఘవరెడ్డి పేరు పెట్టాలని సీపీఎం నాయకులు కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందాల ప్రమీల మాట్లాడుతూ.. నర్రా రాఘవరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం పోరాడిన ప్రజానాయకుడని అన్నారు. నకిరేకల్ ప్రాంత అభివృద్ధికి, పేదలు, కార్మికులు, రైతుల హక్కుల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అలాంటి అమరజీవి పేరును నూతనంగా ప్రారంభమైన 100 పడకల ఆస్పత్రికి పెట్టడం సముచితమైన గౌరవమని అన్నారు.

ఆస్పత్రికి నర్రా రాఘవరెడ్డి పేరు పెట్టేలా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, బొజ్జ చిన్న వెంకులు, పెంజర్ల సైదులు, వంటెపాక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

100 పడకల ఆస్పత్రికి అమరజీవి నర్రా రాఘవరెడ్డి పేరు పెట్టాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News