ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
అమ్మవారికి ప్రత్యేక పూజలు, శ్రీనివాస్ గౌడ్‌కు ఘన సన్మానం
సంస్థాన్ నారాయణపూర్ మండల పరిధిలోని గుడిమల్కాపురం గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ ఈదమ్మ దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక కోలాహలం మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ (శీనన్న) ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఈదమ్మ తల్లి దివ్య ఆశీస్సులు గుడిమల్కాపురం గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సుఖసంతోషాలు విలసిల్లాలని ఆకాంక్షించారు. గ్రామంలో భక్తిప్రపత్తులతో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిందని, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామస్థులను ఆయన అభినందించారు.
అతిథికి ఘన సన్మానం
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు జాజుల శ్రీనివాస్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి