అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు.. భక్తిశ్రద్ధలతో ఘనంగా బోనాల పండుగ.
చిట్యాల:
చిట్యాల మున్సిపల్ పరిధిలోని ముత్యాలమ్మగూడెం 9వ వార్డులో ముత్యాలమ్మ బోనాల పండుగను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు. డప్పుచప్పుళ్లు, మంగళహారతులతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను తీసుకువచ్చి ముత్యాలమ్మ తల్లికి సమర్పించారు. భక్తులు అమ్మవారికి కోడిపుంజులను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని భక్తులు ప్రార్థించారు.బోనాల వేడుకలకు వార్డుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. మహిళల బోనాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి