Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:00 PM

యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయి, మద్యం.. కఠిన చర్యలు తీసుకోండి!

16-06-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

డీఎస్పీ, సీఐలకు మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ వినతి

మాదకద్రవ్యాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం: డీఎస్పీ మధుసూదన్ రెడ్డి హామీ

చౌటుప్పల్ పట్టణ కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి వాడకం రోజురోజుకూ పెరుగుతోందని, విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతోందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆమె చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, సీఐ మన్మధ కుమార్ లను కలిసి ఈ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టి యువతను రక్షించాలని కోరుతూ ఒక వినతి పత్రాన్ని అందజేశారు.​ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. చౌటుప్పల్ పరిసర ప్రాంతాలు అంతర్రాష్ట్ర గంజాయి రవాణాకు ప్రధాన మార్గంగా మారుతున్నాయని, దీనిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలను ముమ్మరం చేయాలని కోరారు. ముఖ్యంగా బెల్టు షాపుల నిర్వాహకులపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల చౌటుప్పల్ బస్టాండ్ పరిసర ప్రాంతాలలో భారీగా గంజాయి పట్టుబడిన ఘటనలను ఆమె గుర్తు చేశారు. స్థానిక పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, కాంట్రాక్టర్ల వివరాలను సేకరించి, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అందుబాటులో ఉంచాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన వినతిపై డీఎస్పీ మధుసూదన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని, బెల్ట్ షాపుల నిర్మూలనకు, బహిరంగ మద్యపాన నిషేధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Sthanikam

యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయి, మద్యం.. కఠిన చర్యలు తీసుకోండి!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News